04-10-2025 12:08:30 AM
మహబూబాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే సెక్షన్ లో చిరుద్యోగి కి మెన్ రమేష్ కూతురు మధులిక మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో సీటు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రైల్వే ఉద్యోగులు అధికారులు ఘనంగా సత్కరించారు.
మహబూబాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఫాజన్ ఆలం ఆధ్వర్యంలో వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ ఆవుల యుగంధర్ యాదవ్, అసిస్టెంట్ సెక్రటరీ బాబురావు వైస్ చైర్మన్ భాస్కరరావు ఆధ్వర్యంలో ఎంబిబిఎస్ విద్యార్థిని మధులికను ఘనంగా సత్కరించారు. తండ్రి కష్టానికి తగ్గ ఫలితం సాధించిందని అభినందించారు. ఈ కార్యక్రమంలో వంశీ, బుర్రి రమేష్, శ్రీనివాస్, గుమ్లాల్, నాగరాజు, సతీష్ పాల్గొన్నారు.