calender_icon.png 23 December, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొలువుదీరిన కొత్త సర్పంచ్‌లు

23-12-2025 02:04:46 AM

ప్రధాన సమస్యలపై తొలి సంతకం

నేటి నుండే కోతుల బెడదను నివారిస్తానన్న మానకొండూర్ సర్పంచ్

రూ.1కే అంత్యక్రియలు నిర్వహిస్తామన్న బూరుగుపల్లి సర్పంచ్

స్వాగతం పలికిన సమస్యలు

కరీంనగర్, డిసెంబరు 22 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని 1224 గ్రామ పంచాయతీల్లో సోమవారం సర్పంచు లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ ని యోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్నారు. చాలాచోట్ల గ్రామాల్లో పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలపై సర్పంచులుగా బాధ్యతలు స్వీకరించినవారు తొలి సంతకం చేశారు.

మానకొండూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ సభాముఖంగా మంగళవారం నుంచి మానకొండూర్‌లో తీవ్రంగా ఉన్న కోతుల బెడదను నివారించేందుకు కోతులను పట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టను న్నట్లు ప్రకటించారు. అలాగే చొప్పదండి ని యోజకవర్గ పరిధిలోని గంగాధర మండలం బూరుగుపల్లి సర్పంచ్ దూలం కళ్యాణ్ కు మార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవ లం ఒక్క రూపాయికే దహన సంస్కారాలను నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో తీ ర్మానం చేశారు.

అలాగే తిమ్మాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీ కారం చేసిన గంకిడి లక్ష్మారెడ్డి హైదరాబాద్ రహదారిని ఆనుకొని ఉన్న తిమ్మాపూర్ పం చాయతీ రహదారికి స్వాగత తోరణం ఏ ర్పాటు చేస్తానని తొలి సంతకం చేశారు. గతం లో లక్ష్మారెడ్డి సర్పంచ్‌గా ఉన్న సమయంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆయన వ్యతిరేక వర్గీయులు ధ్వంసం చేశా రు. దీన్ని తిరిగి నిర్మించడంతోపాటు దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్ర కటించారు. కాంగ్రెస్ బలపర్చిన సర్పంచులు చాలామంది మహాత్మా గాంధీ జాతీయ ఉ పాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించదు పట్ల నిరసన వ్యక్తం చేశారు. 

ఇలా చాలా గ్రామాల్లో సర్పంచులు ప్రధా న సమస్యలను ఏజెండాగా తీసుకుని తీర్మాణాలు చే శారు. ఇదిలా ఉంటే ఆయా గ్రామా ల్లో నెలకొన్న సమస్యలు కొత్త పాలకవర్గానికి స్వాగ తం పలికాయి. గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, మురుగు కాల్వల నిర్మా ణం, రహదారుల నిర్మాణం ప్రధాన సమస్యలు ఉన్నాయి. గత పాలకవర్గాల్లో చాలామంది సర్పంచులకు కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉండడంతో కొత్త సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై గంపెడాశలతో ఉన్నారు.