calender_icon.png 21 November, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు

21-11-2025 01:07:45 AM

  1. విచ్చల విడిగా కొనసాగుతున్న ఇసుక దందా

తహసీల్దార్ కార్యాలయం చుట్టూరా తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లు

ట్రాక్టర్ల సీజ్ వివరాలు అధికారికంగా వెల్లడించడంలో రెవెన్యూశాఖ జాప్యం 

దందా వెనక అధికార పార్టీ నేతలు?

ధర్మపురి, నవంబర్20 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆదేశాలు భేఖాతరు చేస్తున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే సహకరిస్తున్నట్లు బహిరంగ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పత్రికల్లో కథనాలు వచ్చిన, ప్రజలు బాహ్యంగానే అక్రమ ఇసుక దందా గురించి అధికారులకు ముడుపులు ముడుతున్నాయన్న ఆరోపణలు బహుబలంగా వినిపిస్తున్నప్పటికీ తమకేం పట్టదు అన్నట్లు రెవెన్యూశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తుంది.

ప్రతీరోజు ఉదయం నుంచి రాత్రి వరకు వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు తహసీల్దార్ కార్యాలయం ముందర నుండే రవాణా చేస్తున్నప్పటికీ కేవలం రెండు లేదా మూడు ట్రాక్టర్ల పట్టుకుని సీజ్ తో సరిపెడుతున్నారు. రెవె న్యూ శాఖ, ఇతరశాఖల సమన్వయంతో తలుచుకుంటే ఒకటి రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆదిశగా చర్యలు చేపట్టలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

రాష్ట్రప్రభు త్వం కొత్తగా నియమించిన గ్రామ పాలన అధికారులతో రెవెన్యూ శాఖలో సంఖ్యాబలం పెరిగినప్పటికీ భూభారతి, రైతు కొనుగోలు కేంద్రాల ప్రారంభ ఏర్పాట్ల నెపముతో కాలం వెల్లదీస్తున్నారు. పరోక్షంగా అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి ఉదయం రాత్రి అనే తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లు గ్రామాలనుండి ఇసుకను రవాణా చేయడంతో గ్రా మాల ప్రజలు తీవ్ర వాయు, శబ్ద కాలుష్యాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టిసారించి అక్రమ ఇసుక రవణాని అడ్డుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

‘వివరాలు వెల్లడించడములో జాప్యమెందుకు? 

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను ట్రాక్టర్లను గాని అనుమతి లేకుండా పోసిన ఇసుక డంపులను పట్టుకున్నప్పుడు వాటి వివరాలను వెల్లడించడంలో రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ వెల్లడించడానికి జాప్యం చేయడంలో ఆంతర్యం ఏమిటో జాప్యం చేయడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికి అంతు పట్టడం లేదు గతంలో ఆరుకుప్పలను సీజ్ చేసి వేలం వేస్తామని వేలంతేదిని సమయాన్ని ప్రకటించినప్పటికీ ఆ ఇసుక కుప్పలను ఎంతకు విక్రయించారో వివరాలు నేటికీ వెల్లడించలేదు .

అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్నప్పుడు ట్రాక్టర్ల సీజ్ వివరాలు అధికారికంగా ప్రకటించకపోవడం పట్ల పాత్రికేయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి చేకూర్చిన ఆదాయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

‘ దందా వెనక కొందరు అధికార పార్టీ నేతలు?

అక్రమ ఇసుక రవాణా దందా వెనక అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఉన్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణా చేసేవారు ఎండపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందినవారు కాకపోయినప్పటికీ కొందరు స్థానిక నేతలువారికి సహకరించడంతోనే అక్రమ దందా నిత్యం కొనసాగుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఆయా న్యాయబద్ధమైన పనులకు సహకరించమంటే సహకరించనీ స్థానిక నేతలు, స్థానికంగా ఉన్న కార్యకర్తలకు సహకరించకుండా ఇతర ప్రాంతాల వారికి అందులో అక్రమదందా చేసే వారికి సహకరించడం ఏంటని మరికొందరు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.