calender_icon.png 21 November, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి

21-11-2025 01:07:40 AM

కలెక్టరేట్‌లో బాల్య వివాహ ముక్త భారత్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 20: రంగారెడ్డి జిల్లాను బాల్య వివాహాల రహిత గా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జిల్లా శిశు సంరక్షణ సమితి (%ఈ్పుఆఐ%), బాల్య వివాహ ముక్త భారత్ సమావేశం జిల్లా సంక్షేమ అధికారి (%ఇ్పుఈ ఞఐ్పు%) అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు.

జిల్లాను బాల్యవివాహ రహిత జిల్లాగా ప్రకటించేందుకు కావాల్సిన వ్యూహం, అన్ని శాఖల సమన్వయం, గ్రామస్థాయి వరకు బాలల రక్షణ పటిష్టం చేయడం వంటి అంశాలపై చర్చించారు. డీసీపీఎస్ నిర్మాణం, జేజే చట్టం%--%2015 నిబంధనలు, డీసీపీఎస్ విధులు, గ్రామ/మండల స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల బలోపేతం చేయటం, బాల్యవివాహాల నివారణలో పోలీస్, రెవెన్యూ, ఐసిడిఎస్, డిఆర్డిఏ, ఆరోగ్య, విద్య, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖలు తమ తమ బాధ్యతలను చురుకుగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

జిల్లా స్థాయిలో చైల్డ్ మ్యారేజ్ హాట్‌స్పాట్ మ్యాప్, హై-రిస్క్ కుటుంబాల గుర్తింపు, రియల్‌టైమ్ స్పందన వ్యవస్థ, స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించేందుకు నిర్ణయం, రక్షణ, పునరావాసం, విద్యలో తిరిగి చేర్పు, స్పాన్సర్‌షిప్, ఫాస్టర్ కేర్, కౌన్సెలింగ్, నైపుణ్య శిక్షణలు వంటి సేవలను మరింత బలోపేతం చేసే దిశగా సూచనలు చేశారు. పోలీస్ శాఖ ద్వారా పిసిఎంఎ, పిఓసిఎస్‌ఓ, ఐపిసి 370%--%373 చట్టాల కింద కఠిన చర్యలు తీసుకోవాలని, రెవెన్యూ అధికారులు (సీఎంపిఓఎస్) ద్వారా నిషేధ ఉత్తర్వులు, ఆధార్/పుట్టిన తేదీ ధృవీకరణ వంటి చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగాఅడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఆంగన్‌వాడీలు, ఆశాలు, ఏఎన్‌ఎం లు, ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్జీ లు, మహిళా సమాఖ్యలు, ఎన్జీవోలు, చైల్డ్‌లైన్ (1098) వంటి సంఘాలు గ్రామస్థాయిలో పర్యవేక్షణ బలపరచాలని తెలిపారు. సఖి, భరోసా, సిడబ్ల్యుసి, జెజెబి, లీడ్ బ్యాంక్, వికలాంగుల శాఖ, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఆరోగ్య శాఖ వంటి అన్ని సదస్సుల్లో బాల్యవివాహ నిరోధం %ఞ% బాలల హక్కుల రక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్, మండల్‌” కార్యక్రమాన్ని అమలు చేసే ప్రతిపాదనపై చర్చించారు. సమావేశంలో పోలీస్, డిఆర్డిఎ, ఐసిడిఎస్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,  ఆరోగ్య, విద్య, కార్మిక, మహిళా సమాఖ్య, సఖి, భరోసా, చైల్డ్‌లైన్, ఎన్జీవోలు, మరియు మండల/గ్రామ శిశు రక్షణ కమిటీల ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.