calender_icon.png 11 January, 2026 | 10:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత

10-01-2026 12:58:29 AM

సంస్థాన్ నారాయణపూర్, జనవరి 9 (విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసుతో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అందజేశారు. ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి  చెందిన కడారి మహేష్ 40,000, బచ్చనగోని సుధీర్ కుమార్ 26,000, బద్దం రాజు 24,000, చిలువేరు శంకర్60,000, గవ్వల పరమేష్ 60,000, మేకల శంకరయ్య 12,500, పల్లె మారయ్య 21500  చెక్కులు అందజేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి  వరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ముందుగుల బాలకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి, ఎండి యూసఫ్ ఖాన్, ఉప్పరగొని యాదయ్య, భూపని బలరాం, పున్నo యాదగిరి, గునిగంటి రాజు గౌడ్, సాదిక్, నిజాముద్దీన్, ఉప్పల  లలిత, గుండె అండాలు తదితరులు పాల్గొన్నారు.