27-08-2025 01:46:25 AM
కామారెడ్డి, ఆగస్టు 26 (విజయ క్రాంతి) : జనహిత గణేష్ మండలి 9వ వార్షికోత్సవమును పురస్కరించుకొని మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చేతుల మీదుగా కార్యాలయ ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంల ఈ సంవత్సరం కూడా మట్టి గణపతుల పంపిణీ చెప్పటిన జనహిత గణేష్ మండలి అభినందనీయమని అన్నారు.
పర్యావరణహితమైన మట్టి గణపతిలను పూజించడం మంచి సాంప్రదాయమని తెలిపారు. అదేవిధంగా జిల్లా ఉద్యో గులకు, ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టిజిఈజేఏసి చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, జిల్లా టీజీవోస్ సంఘం అధ్యక్షులు దేవేందర్, టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి ఎం. నాగరాజు, వారి కార్యవర్గ సభ్యులు, టీజీఓస్ జిల్లా కార్యదర్శి సాయి రెడ్డి వారి కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు అధికారులు, జిల్లా టి ఆర్ ఈ ఎస్ ఏ కార్యవర్గ సభ్యులు, జిల్లా క్లాస్ ఫోర్ సంగం కార్యవర్గ సభ్యులు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయము జనహిత గణేష్ మండలి కార్యవర్గ సభ్యులు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆడ్లూరు ఎల్లారెడ్డి లో
సదాశివ నగర్, ఆగస్టు 26 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం మట్టి గణపతులను పంపిణీ చేశారు. 500 మట్టి గణప తులను రామ్ శెట్టి భూపతి పంపిణీ చేశారు. మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బొలిపెల్లి మహేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పైడి జానకి, విండో చైర్మన్ సదాశివరెడ్డి, సి డి సి చైర్మన్ ఇర్షాద్, గ్రామ విడీసీ అధ్యక్షుడు ముదాం సత్యం, గంపల రాజిరెడ్డి,చక్రధర్ గౌడ్, సంగారెడ్డి, పయ్యావుల గంగాధర్, ఆకుల కృష్ణ, వాదుల జైపాల్ రెడ్డి, మోసార్ల. మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.