calender_icon.png 27 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం టీజీఈజేఏసీ పోరాటం

27-08-2025 01:47:59 AM

కామారెడ్డి జిల్లా ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ నరాల వెంకటరెడ్డి 

కామారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి), ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాస్ రావుల ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని కామారెడ్డి జిల్లా చైర్మన్, టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి  పిలుపు నిచ్చారు.

ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగ వర్గం అంతా సమిష్టిగా పోరాడాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సమావేశంలో అన్ని రంగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కొరకై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పటికీ సమస్యలు పరిష్కారం కానందున వాటి యొక్క పరిష్కారానికి పోరాడాలని తెలిపారు.

రాష్ట్ర స్థాయిలో 206 సంఘాల భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన ఉద్యోగ జేఏసీ సుదీర్ఘ చర్చల అనంతరం జేఏసీ చైర్మన్  మారం జగదీష్ , సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ ఉద్యమ కార్యాచరణను తెలుపుతూ... సెప్టెంబర్ 1 వ  తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఈ సమావేశంలో తెలిపారు.దానికి అనుగుణంగా కామారెడ్డి జిల్లా శాఖ TGEJAC సమావేశమై హెచ్ ఓ డి ఉద్యోగుల న్యాయమైన హక్కులు, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు, పెండింగ్ బిల్స్ ని వెంటనే విడుదల చేయాలని అన్నారు, అన్ని హెచ్ ఓ డి లలో కొత్త స్టాఫింగ్ పాటర్ని ఇవ్వాలని అన్నారు, పెండింగ్ లో ఉన్న అన్ని కరువు భత్యాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానించుకున్నారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీ న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం హైదరాబాద్ నగరంలో తెలుగు లలిత కళాతోరణంలో సిపిఎస్ అంతం కోసం జరిగే పెన్షన్ విద్రోహ దినాన్ని జిల్లా లో ఉన్న అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సెప్టెంబర్ 1వ  తేదీన తలపెట్టినటువంటి పాత పెన్షన్ సాధన పోరాట సభ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది.. నంతరం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ గార్లకు TGEJAC తదుపరి కార్యచరణ గురించి వివరించారు.

నిరసన వేదిక జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో TGEJAC చైర్మన్, టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, TGEJAC సెక్రటరీ జనరల్ టీజీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు ఆర్ దేవేందర్,టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, టీజీవో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, ఏ నరసింహారెడ్డి,TRESSA, లింగం, ఎస్ టి యు జిల్లా అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, టి పి ఆర్ టి యుts జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్రావు, tscpseu జిల్లా ప్రధాన కార్యదర్శి బాణాల భాస్కర్ రెడ్డి, టి ఆర్ టి యు  జిల్లా అధ్యక్షులు ఎం ఏ బషీర్, టి టి యు జిల్లా అధ్యక్షులు ముజిబుద్దిన్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.