27-08-2025 01:45:11 AM
ఎల్లారెడ్డి ఆగస్టు 26 (విజయక్రాంతి) ఎల్లారెడ్డి పట్టణంలోని, బాలికల, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాఠశాలలో,పాఠశాల ఉపాధ్యాయురాలు,భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను సృజనాత్మకంగా తీర్చిదిద్దారు.
తాము తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాలను విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులకు పంపిణీ చేసి తమ ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మండల పిఆర్టియు అధ్యక్షులు పట్లోళ్ల శ్రీనివాస్, లింగమూర్తి దేవదాస్ రామకృష్ణ ఈస్త్మ్రల్ మాధురి మాధవి ప్రధాన కార్యదర్శి ఎస్ వినయ్ కుమార్ పాల్గొన్నారు.