calender_icon.png 30 December, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివాసీలకు దుస్తుల పంపిణీ

30-12-2025 01:14:00 AM

చర్ల, డిసెంబర్ 29, (విజయక్రాంతి): సేవ చేయడమే జీవితానికి అర్థం పరమార్థమని వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు గుం టూరు రమాదేవి పేర్కొన్నారు. చర్ల, కొత్తగూడెం వికాస తరంగిణి శాఖల ఆధ్వర్యంలో చర్ల మండలంలోని మారుమూల కీకారణ్య కిష్టారంపాడు ఆదివాసీలకు హైదరాబాద్ కు చెందిన వినోద్, గౌతమ్, మధు లు అందించిన రూ.30 వేల విలువైన చీరలు, రగ్గులు, దుస్తుల పంపిణీ కార్యక్రమం వికాస తరంగిణి అధ్యక్షుడు గుంజి పురుషోత్తం అధ్యక్ష తన సోమవారం జరిగింది.

ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ జిల్లాలో వికాస త రంగిణి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిందని,మానవ సేవే మాధవ సేవన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతగా నిలవడం మానవ ధర్మమన్నారు. భవిష్యత్ లో సంస్థ తరపున మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. వికాస తరంగిణి బాధ్యులు నాగేశ్వరరావు, బాబా, సరోజినీ ,పద్మ ,ఎడ్ల సత్తిబాబు, లవన్ కుమార్ రెడ్డి ,ప్రశాంత్, మణికంఠ, మడకం చందు పాల్గొన్నారు.