19-11-2025 10:35:37 PM
కార్యక్రమంలో పాల్గున తాహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి
చేగుంట (విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో గల ప్రముఖ సంఘ సేవకులు అయిత కుటుంబ సభ్యుల సమేతంగా నిర్వహించిన కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమంలో చేగుంట తాహసిల్దార్ శివప్రసాద్, స్థానిక ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసంలో వనభోజనాలు అంటే కుటుంబం, స్నేహితులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలు, తోటలు, దేవాలయాలు, ముఖ్యంగా ఉసిరి చెట్ల కింద భోజనం చేయడం ఈ ఆచారం. ఈ వనభోజనాలు ప్రకృతితో బంధాన్ని గుర్తు చేస్తూ, ఆనందాన్ని, ఉల్లాసాన్ని పంచుతుంది. కార్తీక మాసంలో ఎక్కవగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా పవిత్రమైనదిగాభావిస్తారని, ఉసిరి చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారని వారు ఉన్నారు.