27-08-2025 01:43:32 AM
కామారెడ్డి, ఆగస్టు 26 (విజయ క్రాంతి): జిల్లాలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ సురేష్ శెట్కార్ తో కలిసి వినాయక మండపాలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ తరపున లడ్డులు పంపిణి చేసారు. వినాయకుని అశీసులు అందరిపై ఉండాలని కోరారు.
ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను తీసుకురావాలని షబ్బీర్ అలీ ఆశభావం వ్యక్తం చేసారు. వినాయక చవితి అనేది భక్తి సంస్కృతి మరియు ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని షబ్బీర్ అలీ గారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.