calender_icon.png 27 August, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

27-08-2025 01:42:26 AM

కామారెడ్డి, ఆగస్టు 26 (విజయక్రాంతి), కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శేట్లూర్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్న భోజన పథకంలో  జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన విద్యార్థులను జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తార పరామర్శించారు.

బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శెట్లుర్ గ్రామ విద్యార్థులు మధ్యాహ్నం ఆహార పథకంలో అస్వస్థకు గురి అయినా విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే అరుణా తార వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని డాక్టర్ తో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో బిచ్కుంద బిజెపి మండల పార్టీ అధ్యక్షులు శెట్టిపల్లి విష్ణు, పెద్ద దేవాడ మాజీ సర్పంచ్ మల్లికార్జున్ దేశాయి, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లు దేశాయ్, బీజేపీ ఉపాధ్యక్షులు హడికే వార్ రాజు, బిజెపి బూత్ అధ్యక్షులు రాజు పటేల్,బిజెపి సీనియర్ నాయకులు మొగులు గొండ, తదితరులు పాల్గొన్నారు.