10-11-2025 01:20:02 AM
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 9 (విజయ క్రాంతి): పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి మిగిలిపోయిన ఐదు డైరెక్టర్ స్థానాల కు ఎన్నికలు నిర్వహించి ఎన్నికల అధికారి భూపతి ఫలితాలను ప్రకటించారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు డైరెక్టర్లకు నియామక పత్రాలను అందించారు.
నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను డైరెక్టర్లను పూలమాలలు సాల్వలతో ఘనంగా సత్కరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా దూడం శంకర్, ఉపాధ్యక్షులుగా గాజుల బాలయ్య మోర రవి ప్రధాన కార్యదర్శిగా మండల సత్యం, కోశాధికారిగా ఏళ్లే లక్ష్మీనారాయణ, సహాయ కార్యదర్శిగా కోడం శ్రీనివాస్ లు ఏకగ్రీవం అయ్యారు. 39 మంది డైరెక్టర్లలో కొన్ని కొంతమంది ఏకగ్రీవం కాగా మరికొంతమందికి ఎన్నికలునిర్వహించారు.