calender_icon.png 19 September, 2025 | 6:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షేత్రస్థాయిలో సమస్యలకు తక్షణ పరిష్కారం

19-09-2025 12:00:00 AM

-టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారప్ ఫారుకి 

-బస్తీబాటలో వినియోగదారుల కష్టాలపై తక్షణ స్పందన, అధికారులకు ఆదేశాలు జారీ

మణికొండ  :సెప్టెంబర్, 18(విజయక్రాంతి) : క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు తెలు సుకుని, వాటిని తక్షణం పరిష్కరించే లక్ష్యం తో టిజిఎస్పిడిసిఎల్ సిఎండి ముషారప్ ఫారుకి గురువారం రాజేంద్రనగర్ సర్కిల్లో పర్యటించారు. ’బస్తీ బాట’ కార్యక్రమంలో భాగంగా ఆయన శివరాంపల్లి, రాజేంద్రనగర్ సెక్షన్లలో విస్తృతంగా పర్యటించి, విద్యు త్ వినియోగదారుల సమస్యల ను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికే ఈ బస్తీబాట కార్యక్ర మాన్ని ప్రతి వారం మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

శివరాంపల్లి గ్రామంలో పర్యటన సందర్భంగా ప్రమాదకరంగా, తక్కువ ఎత్తులో వేలాడుతున్న ఎల్టి విద్యుత్ లైన్లను ఆయన గమనించారు. వాటి స్థానంలో వెంటనే ఏబి కేబుల్స్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 11కెవి, 33కెవి లైన్లను భూగర్భ కేబుల్ వ్యవస్థగా మార్చాలని ఆదేశించారు. దీనికి సం బంధించిన అంచనాలను త్వరితగతిన రూపొందించి, సాంకేతిక అనుమతులు పొం ది పనులను వెంటనే ప్రారంభించాలని విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఇంజనీర్లు, సిబ్బంది పనితీరుపై ఆయన సమీక్షించారు. ప్రతీ ఒక్కరూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని, నాణ్యమైన, అంతరా యం లేని విద్యుత్ సరఫరా కోసం నిరంతరం శ్రమించాలని ఆయ న సూచించారు. అనంతరం, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్టు భవన ప్రాంగణాన్ని ఆయన సందర్శించారు.

అక్కడ విద్యుత్ లైన్ల తొలగింపు పనుల పురోగతిని పర్యవేక్షించి, పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో టిజిఎస్పిడిసిఎల్ ఆపరేషన్ డైరెక్టర్ నరసింహులు, రాజేంద్రనగర్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ డిఎస్ మో హన్, డివిజనల్ ఇంజనీర్ పి రత్నాకర్ రావు, సబ్ డివిజనల్ ఇంజనీర్ జి సత్యనారాయణ, రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం దుర్గాప్రసాద్, శివరాంపల్లి అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.