22-11-2025 01:50:52 AM
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి) : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్మకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం తిరుమ లలో ఆమె శ్రీవారి దర్శనం పూర్తి చేసుకున్నారు.
అనంతరం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన రాష్ట్రపతి సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లా రు. శనివారం బేగంపేట ఏయిర్ పోర్టు నుంచి పుట్టపర్తికి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీసీ సజ్జనార్ తదితరులున్నారు.