calender_icon.png 12 May, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామకోటి పుస్తకాల పంపిణీ

07-04-2025 12:19:52 AM

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6 (విజయ క్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మగ్దుం నగర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బచ్చు మౌనిక ఆంజనేయులు సహకారంతో రామకోటి పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన నాయకులు కొలుకుల జైహింద్, ఎస్‌ఐ శంకర్ హాజరై రామకోటి పుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జైహింద్ మాట్లాడుతూ వేసవికాలంలో చిన్నారులలో దైవభక్తిని పెంపొందించడానికి శివాజీ యూత్ అసోసియేషన్ చేసిన ప్రయత్నాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు శివకుమార్ గన్నా రం, సతీష్ షిండే, ఆంజనేయులు గుప్తా, బాచు మౌనిక, వీరేష్, శ్రీ సాయిలు, యశ్వం త్, కూర రాజు తదితరులు పాల్గొన్నారు.