calender_icon.png 23 December, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు క్రీడా సామగ్రి పంపిణీ

23-12-2025 12:00:00 AM

మునిపల్లి, డిసెంబర్ 22 : మునిపల్లి మండలం బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పడకంటి శబ్నం అనే క్రీడాకారిని సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంది. గ్రామ సర్పంచ్ గా సోమవారం నాడు బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగాగ్రామ సర్పంచ్ హస్నాబాద్ రేణుక వెంకట్ రాములు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక వెంకట్రాములు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలో రాణించడం అభినందనీయమన్నారు. అలాగే తమ గ్రామానికి చెందిన విద్యార్థి చిన్న వయసులోనే క్రీడల్లో రాణించడం పట్ల ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.