calender_icon.png 23 December, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవాలలో పాల్గొన్న సుడా చైర్మన్

22-12-2025 11:03:16 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): సోమవారం రోజున జరిగిన సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేద్దామని నిధులు తీసుకురావడంలో తమవంతు సహకారం అందిస్తానని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.

కొత్తపల్లి మండలం ఎలగందల్,కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ఖాన్ పేట్,చామన్ పల్లి,చర్లభూత్కూర్, దుబ్బపల్లి,ఫకీర్ పేట్,జూబ్లీ నగర్, ఎలబోతారం గ్రామాల్లో సుడా చైర్మన్ పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజల స్వామి గౌడ్, కాంరెడ్డి రాంరెడ్డి, నాయకులు  పిట్టల రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిని తిరుపతి, గ్రామ శాఖ అధ్యక్షులు మరియు నాయకులు  పాల్గొన్నారు.