23-12-2025 02:09:10 AM
మొయినాబాద్, డిసెంబర్ 22 (విజయ క్రాంతి): చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం కోసం తోడు నీడ ఫౌండేషన్ అండగా నిలిచింది. మొయినాబాద్ మండల పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం గలలో ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి స్వెట్టర్లను అందజేశారు.ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ.. శివారు గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు చలి తీవ్రత వల్ల పడుతున్న ఇబ్బందులను గమనించి. విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశామని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ తరపున ఈ చిన్న సాయం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సెక్రటరీ రాజేష్, పాఠశాల హెడ్ మాస్టర్,ముజీబ్ ,రవీందర్ , శివ కుమార్, పూర్ణ చంద్రరావు,శకుంతల, కవిత, సుధాకర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు రాజేశ్వరి, రాజేష్ లకు ధన్యవాదాలు తెలుపుతూ.. పదవతరగతి లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తామని చెప్పారు.