10-11-2025 12:00:00 AM
మాగనూరు నవంబర్ 9. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ర్టంలోనే పేదలకు రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు ఆదివారం మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున రేషన్ బియ్యం తీసుకోవడానికి తయారు చేసిన చేతి సంచులను వారు పంపిణీ చేసి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వారందరికీ రేషన్ కార్డులు వచ్చాయన్నారు .
పేదల ఆకలి బాధలు తెలిసిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నారు .కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు దండు ఆనంద్, చక్రపాణి రెడ్డి, కృష్ణయ్య ,ఆంజనేయులు , సురేష్ కుమార్, మారెప్ప, చేన్నప్ప , వివిధ పార్టీల నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.