calender_icon.png 10 November, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలన అధ్వానం!

10-11-2025 12:00:00 AM

- పాపన్నపేట ప్రజలను వెంటాడుతున్న సమస్యలు

- తూతూ మంత్రంగా పారిశుద్ధ్యం నిర్వహణ

- పరిష్కరించడంలో అధికారులు విఫలం

పాపన్నపేట, నవంబర్ 9 :గ్రామాల్లో మురుగుపారుదల వ్యవస్థను ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నాం.. ఎప్పటికప్పుడు చెత్తాచెదారం శుభ్రం చేయిస్తున్నాం.. వాడ వాడలా నీటి ఎద్దడి లేకుండా చూస్తున్నాం.. ఇవి మన అధికారులు, పాలకులు చెబుతు న్న మాటలు. వారి మాటలు వట్టి మూటలుగా మారుతున్నాయె తప్ప ఎక్కడ ఆచర ణలో అమలు కావడం లేదు. దీంతో మురు గు, చెత్తాచెదారం, నీటి సమస్యలతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండల కేంద్రం పాపన్నపేటలో మురుగు కాలువలు సక్రమంగా లేకపోవ డం, ఎప్పటికప్పుడు మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురుగుపారుద ల అధ్వానంగా మారింది. చినుకు పడితే మురుగు కాలువలు నుండి మురుగు రోడ్డు పై ప్రవహిస్తోందని స్థానికులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఇళ్ళ ముందు మురుగు ని లిచి దుర్వాసన వెదజల్లుతూ దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇంటి బ యట ఉండాలంటే దోమలతో భయమేస్తోందంటున్నారు. మురుగు కాలువల వెంట పి చ్చి మొక్కలు పెరిగి మురుగు ముందుకు సాగడం లేదు. దీంతో దోమల ఆవాసాలుగా మారుతున్నాయి. 

డంపింగ్ యార్డు పక్కనే చెత్త పారబోత..

గ్రామంలో సేకరించిన చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డ్ లో వేరు చేయకుండా, నిర్లక్ష్యంగా డంపింగ్ యార్డ్ పక్కనే కుప్పలుగా పోస్తున్నారు. దీంతో దుర్వాసన వెదజల్లడమే కాకుండా డంపింగ్ యార్డ్ నిరుపయోగంగా మారింది. రూ.లక్షల ప్రజల ధనం వృధాగా మారుతోంది. 

ట్యాంకుకు నీటి సరఫరా లేకపోవడంతో..

గ్రామంలో సింగిల్ ఫేజ్ బోరు మోటార్ల వద్ద ఏర్పాటు చేసిన ట్యాంకులకు బోరు మోటార్ల నుంచి నీటి సరఫరా లేకపోవడం తో నిత్యం నీరు వృధాగా పోతోంది. ట్యాం కులకు నీటి సరఫరా చేసి వినియోగంలోకి తీసుకువస్తే నీరు, విద్యుత్తు వృధాను అరికట్టవచ్చు.

పారిశుద్ధ్యం కొరవడి..

పాపన్నపేటలో పారిశుద్ధ్య పనులు కుం టుపడ్డాయి. గ్రామంలో కనీసం నెల రోజులకోసారి కూడా పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదని ఆయా వాడల ప్రజలు మండిపడుతున్నారు. మురుగు కాలువలను శుభ్రం చేయ కపోవడంతో పిచ్చి మొక్కలు, మురుగు పేరు కు పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం

డంపింగ్ యార్డ్ పక్కనే చెత్త పారబోస్తున్న విషయం నిజమే. గ్రామంలో ఉ న్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. మురుగు కాలువలను శుభ్రం చేయిస్తాం. సింగిల్ ఫేస్ బోరు మోటారు నుంచి ట్యాంకులకు నీ టి సరఫరా చేపడతాం. ప్రజలు సైతం వి ద్యుత్తు, నీటి వృధాను అరికట్టాలి. అవసరం తీరాక బోరు మోటారు స్విచ్ ఆఫ్ చేయాలి.

విష్ణువర్ధన్, ఎంపీడీవో, పాపన్నపేట