10-11-2025 12:00:41 AM
మాగనూరు. నవంబర్. 9. రాష్ర్టంలో దివ్యాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా మార్చాలని జీవో నెంబర్ 34 ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని మాగనూరు మండల దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడు పి బాబు పిలుపునిచ్చారు.
ఆదివారం మాగనూరు మండల కేంద్రంలో 167వ జాతీయ రహదారి పక్కల గలఅంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్ ఆర్ డి పి పోస్టర్ను విడుదల చేసి వారు మాట్లాడుతూ రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల ముందు దివ్యాంగులకు వికలాంగుల పెన్షన్ పెంచుతామని వాగ్దానాలు చేసి నేటికీ పెంచకపోవడం ఏంటని వారు ప్రశ్నించారు. ఓట్ల కోసం అబద్ధాలు ఆడి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వికలాంగులకు పెన్షన్ పెంచాలని వారి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.