calender_icon.png 9 July, 2025 | 5:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వు కొట్టినట్టు చెయ్యి.. నేను ఏడ్చినట్టు చేస్తా...

09-07-2025 12:40:19 AM

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వ్యవహారంపై మండిపడ్డ ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు రెం డు ప్రజా సమస్యలు చర్చకు రావద్దని ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే విధంగా రాజకీయ సవాళ్లతో ఒకరిపై ఒకరు మీడియా వేది కగా విమర్శించుకుంటున్నారని బీజేపీ ఎమ్మె ల్యే పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ శాసనసభకు నరేంద్ర మోడీ వస్తాడా కిషన్ రెడ్డి వస్తాడా చర్చిస్తామని అంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పదలుచుకున్నదొకటే తెలంగాణ శాసనసభకు ప్రధాన మంత్రి రాగలడా ముఖ్యమంత్రికి తెలియదా అని అన్నారు. కూలిన కాళేశ్వరం ఏమైంది, ఫోన్ టైపింగ్ వ్యవహారం ఏమైందని అసెంబ్లీలో మేము స్పష్టంగా అడిగామని అన్నారు.

కాళేశ్వరంలో అక్రమంగా సంపాదించిన సొమ్మంతా విదేశాలకు వెళ్ళిందని, గతంలో కాంగ్రెస్ సీబీఐ ఎంక్వైరీ గురించి మాట్లాదిందని,  అది ఏమైందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వం శాసనసభలో సమాధానం చెప్పకుండా నేను కోట్టినట్టు చేస్తా.... నువ్వు ఏడ్చినట్టు చెయ్యు...అనే విదంగా ఇరు పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

సీఎం ఒకటి చెబితే మంత్రులు మరొకటి చేబుతున్నారని, కాంగ్రెస్ మంత్రివర్గంలోనే ఇంత తేడా ఉంటే ఎట్లా అని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వాళ్లు సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా 18 నెలలుగా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు.

గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్‌ఎస్ పార్టీ అన్ని అక్రమాలు చేసిందని మీరే చెప్పారు కదా ... ఎంక్వయిరీ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు.  ఈ సమావేశంలో బీజేపీ నాయకులు లాలా మున్న, మయూరీ చంద్ర, జోగు రవి, ఆకుల ప్రవీణ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.