09-07-2025 12:39:59 AM
- రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్
- కొత్త సంవత్సరంలోపు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి
రాజన్న సిరిసిల్ల జులై 8 (విజయక్రాంతి); మిడ్ మానేర్ రిజర్వాయర్ ముంపు గ్రామా ల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అగ్రహారం వద్ద గల శ్రీ ఫంక్షన్ హాల్ లో మిడ్ మానేర్ రిజర్వాయర్ ముం పు గ్రామాల నిర్వాసితులకు ఇల్లు కట్టుకొని ఖాళీ ఫ్లాట్స్ ఉన్నవారికి స్పెషల్ కోటా కింద 847 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల ను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా ప్రభు త్వం 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో మంజూరు చేశామని, వే ములవాడ నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికే పంపి ణీ చేశామని, స్పెషల్ కోట కింద మిడ్ మా నేరు నిర్వాసిత గ్రామాల ప్రజలకు నేడు 847 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, మరో మూడు వేల ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పెండింగ్ విచారణలో ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో మిగిలిన వారికి తప్పనిసరిగా ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.
ముంపు గ్రామాల నిర్వాసితుల శాశ్వత పరిష్కారం లభిస్తుందని, వే ములవాడ అర్బన్ ప్రాంతంలోని ముంపు గ్రామాల రిజర్వాయర్ నిర్వాసితులకు తప్పనిసరిగా ఇండ్లు మంజూరు అవుతాయని అ న్నారు. భారత దేశంలో ఎక్కడ కూడా పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఐదు. లక్షల రూ పాయలు ఖర్చు చేయడం లేదని, రేవంత్ రె డ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మా త్రమే పెద్ద ఎత్తున పేదలకు నిధులు మం జూరు చేస్తుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, స్టేట్ రిజర్వు నుంచి మొట్ట మొదటి సారిగా ఐదు వేల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వ విప్ మిడ్ మానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వ విప్ ప్రత్యేక చోరువతో మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంద ని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించాలని కలెక్టర్ తెలిపారు.
600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణం లో నిర్మిస్తే చెల్లింపు లలో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.అమ్మ నాన్న చనిపో యిన కేసులలో పిల్లలకు ఆ ఇల్లు వచ్చేలా చూస్తామని అన్నారు. నేడు 847 మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు చేస్తున్నామని, వీరు కొత్త సంవత్సరం లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాము, పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ ఇతర ప్రజా ప్రతినిధులు ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, నాయకులు లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.