calender_icon.png 31 January, 2026 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో జకోవిచ్, అల్కరాజ్

31-01-2026 01:08:25 AM

మెల్ బోర్న్ , జనవరి 30: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ రసవత్తర పోరుకు వేదిక కానుంది. ఊహించినట్టుగానే టాప్ సీడ్, వరల్ నెంబర్ 1 కార్లోస్ అల్కరా జ్, సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ టైటిల్ పోరుకు దూసుకొచ్చారు. ఈ సారి రెండు సెమీఫైనల్స్ కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగి అభిమానులను ఉర్రూతలూగించాయి. మొదటి సెమీస్ లో అల్కరాజ్, జ్వెరెవ్ ను ఓడించాడు. ఐదు గంటలకు పైగా ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అల్కరాజ్ 6-4, 7-6(5), 6-7(3), 6-7(4), 7-5 విజయం సాధించాడు.  మొదటి రెండు సెట్లను అల్కరాజ్ గెలుచుకున్నప్పటికి.. జ్వెరెవ్ గట్టి పోటీ నిస్తూ తర్వాతి రెండు సెట్లను టై బ్రేకర్లలో సొంతం చేసుకున్నాడు. అయితే మూడో సెట్లో అల్కరాజ్ కుడి కాలికి గాయం కావడంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకుంటాని అంతా అనుకున్నారు. కానీ అల్కరాజ్ మా త్రం అద్భుతమైన పోరాటం కనబరిచాడు.

మెడికల్ టైమ్ అవుట్ తీసుకుని తిరిగి కోర్టు లో అడుగుపెట్టాడు. నిర్ణయాత్మక ఐదోసెట్లో 3-5తో అల్కరాజ్ వెనుకబడినప్పటికీ.. తర్వా త తన మార్క్ షాట్లతో పుంజుకుని సెట్తో పా టు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. మరో సెమీస్‌లో జకోవిచ్ దుమ్మురేపాడు. దాదా పు ఓడిపోతాడనుకున్న మ్యాచ్ లో గెలిచి 38వ గ్రాండ్ శ్లామ్ ఫైనల్ కు చేరుకున్నాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో జకోవిచ్ 3-6, 6-3, 4-6, 6-4, 6-4 స్కోర్ తేడా తో రెండో సీడ్ జాన్ సిన్నర్ పై గెలుపొందాడు. తొలి సెట్ కోల్పోయి వెనుకబడిన ప్పటకీ తర్వాత జకోవిచ్ పుంజుకున్న తీరు అద్భుతమనే చెప్పాలి. కోర్టులో ప్రత్యర్థి ఆటగాడికి ధీటుగా కదులుతూ పాయింట్లు సా ధించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్, అల్కరాజ్ తలపడతారు. అల్కరాజ్ గెలిస్తే అత్యంత చిన్న వయసులో కెరీర్ గ్రాండ్ శ్లామ్ పూర్తి చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.