31-01-2026 01:05:34 AM
మెగాటోర్నీకి అమెరికా జట్టు ప్రకటన
న్యూయార్క్ , జనవరి 30: ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ఇంకా వారం రోజులే సమయం మిగిలి ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. తాజాగా యుఎస్‌ఏ జట్టును కూడా ప్రకటించారు. 15 మంది సభ్యులు గల బృందానికి మోనాంక్ పటేల్ నాయకత్వం వహిస్తాడు. జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, మిలింద్ కుమార్, షాయన్ జహంగీర్, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెం జిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్ లు తిరిగి జట్టులోకి వచ్చా రు. 2024 టీ20 ప్రపంచకప్ ఆడినవారిలో 10 మంది ప్రస్తుత జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నారు. టీ20 ప్రపంచకప్లో ఆడ డం యూఎస్‌ఏకు ఇది రెండోసారి.
2024 టీ20 ప్రపంచకప్లో యూఎస్‌ఏ జట్టు పాకిస్తాన్ను సూపర్ ఓవర్లో ఓడించింది. యూఎస్ ఏ దెబ్బకు అప్పుడు పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో ప్రస్తుత టోర్నీలో యూఎస్‌ఏ ఎవరికి షాకిస్తుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూ స్తున్నారు. కాగా కీలక ఆటగాడైన ఆరోన్ జోన్స్ మ్యాచ్ ఫిక్సిం గ్ ఆరోపణలపై సస్పెండయ్యాడు. కాగా టీ20 ప్రపంచకప్లో యూఎస్‌ఏ భారత్, పాక్, నెదర్లాండ్స్, నమీబియాలతో కలిసి గ్రూప్-ఏలో ఉంది. యూ ఎస్‌ఏ తమ తొలి మ్యాచ్ ఆతిథ్య భారత్తో ఫిబ్రవరి 7న వాంఖడే స్టేడియంలో ఆడనుంది.
యూఎస్‌ఏ జట్టు:
మోనాంక్ పటేల్ (కెప్టెన్), జెస్సీ సింగ్, ఆండ్రీస్ గౌస్, షెహన్ జయసూర్య, మిలింద్ కుమార్, షయాన్ జహంగీర్ , సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, నోస్తుష్ కెంజిగే, షాడ్లీ వాన్ షాల్క్విక్, సౌరభ్ నేత్రవల్కర్, అలీ ఖాన్, మహ్మద్ మొహ్సిన్, షుభా మొహ్సిన్, షుభా రంజానే.