02-05-2025 01:09:04 AM
పటాన్ చెరు/జిన్నారం, మే 1 :మండల కేంద్రం జిన్నారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో గాయిత్రిదేవి గురువారం తనిఖీ చేశారు. నూతనంగా నిర్మించి న ఆసుపత్రి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆసుపత్రికి వస్తున్న వారికి అందుతు న్న వైద్య సైవలపై ఆరా తీశారు. ప్రసూతి సౌకర్యాలపై గ్రామాలలో అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
ప్రస్తు తం పద్నాలుగు మందికి ప్రసూతి సౌకర్యం కల్పించినట్లు వైద్యురాలు కోమలి తారక్ డీఎంహెచ్వోకు తెలిపారు. ప్రతి గురువారం నిర్వహించే ఓపీకి మరింత ప్రచారం కల్పించి అందరికి తెలియజేయాలన్నారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్వ చ్చంద సంస్థలు ముందుకు రావాలని కోరా రు. వైద్యులు, సిబ్బంది పని తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు.