calender_icon.png 2 May, 2025 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడున్నర కిలోల బంగారం పట్టివేత

02-05-2025 01:09:58 AM

  1. ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ  
  2. పసిడి విలువ సుమారు రూ.3.5 కోట్లు  

రాజేంద్రనగర్, మే 1: దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి డీఆర్‌ఐ అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

యిర్‌పోర్ట్‌లోని ఏరో బ్రిడ్జి వద్ద బుధవారం అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చే గేటు మీదుగా మన దేశానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అధికారులు గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా వచ్చిన సదరు వ్యక్తి మరో వ్యక్తికి బంగారాన్ని చేరవేస్తుండగా డీఆర్‌ఐ, హెచ్‌జెడ్‌యూ సిబ్బంది 10 తులాలు బరువున్న 30 కడ్డీలను పసిడిని స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బంగారం 99.90 స్వచ్ఛత కలిగి ఉన్నదని అధికారులు వెల్లడించారు. బంగారం విలువ రూ.3.45 కోట్టు ఉంటుందని నిర్ధారించారు. దుబాయ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎయిర్‌పోర్టు పార్కింగ్ స్థలంలో మరో వ్యక్తికి ఇవ్వాల్సి ఉన్నట్లు తమ విచారణలో తేలిందని డీఆర్‌ఐ అధికారులకు వెల్లడించారు.