02-05-2025 01:08:49 AM
ప్రొఫెసర్ కంచె ఐలయ్య
ఖైరతాబాద్, మే 1: జనాభా లెక్కలతోపాటు కులగణన చేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు.
గద్దర్ గళం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం చేస్తామన్న కులగ ణలో ముస్లిం, క్రిష్టియన్ల సంఖ్యను లెక్కించాల్సి ఉందన్నారు. దానికోసం ముస్లిం, క్రిష్టియన్లు తమ కులాల లెక్కలు తేల్చాలని ప్రభుత్వాలను డిమాండ్ చేయాలని సూచించారు. తెలంగాణ తరహాలనే కేంద్రం కూడా జనాభా, కులగణన లెక్కలు తీయాలన్నారు.