17-01-2026 04:02:10 AM
బీజేపీ సీనియర్ నేత పీఎల్ శ్రీనివాస్
సికింద్రాబాద్ జనవరి 16 (విజయ క్రాంతి): చారిత్రకమైన సికింద్రా బాద్‌ను మల్కాజ్గిరి, రాచకొండ వంటి తరువాత కాలంలో ఏర్పడిన, పరిపాలనా పరంగా స్పష్టతలేని ప్రాంతాల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదన కేవలం ఒక బ్యూరోక్రాటిక్ చర్య మాత్రమే కాదు, ఇది చరిత్రపై, గుర్తింపుపై, పౌర జ్ఞాపకాలపై దాడి. నగరాలు లెగో బ్లాక్స్లా ప్రభుత్వాల సౌలభ్యం కోసం తిరగబెట్టడానికి వీలైనవి కావు. అవి సంస్కృతి, క్రమ శిక్షణ, భౌగోళికత, పౌర భావజాలం ద్వారా దశాబ్దాలుగా రూపుదిద్దుకున్న జీవంతమైన వ్యవస్థలు.
ఈ ప్రతి ప్రమాణంలోనూ సికింద్రాబాద్ ప్రత్యేకంగా నిలుస్తుంది అన్ని ఎస్ వి ఐ టి సెక్రటరీ,కరస్పాండెంట్, బిజెపి సీనియర్ నేత, పి ఎల్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా పిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ ప్రభు త్వం సక్రియంగా పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం, గ్రేటర్ హైదరా బాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను మూడు విడి పౌర సంస్థలుగా గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ మల్కాజిగిరి, గ్రేటర్ సైబరాబాద్ విభజించాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌కు ప్రత్యేక మునిసిపల్ కార్పొరేషన్ హోదా ఇవ్వాలన్న దీర్ఘకాలిక, విస్తృతమైన ప్రజాభిలాష ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదన వచ్చింది,సికింద్రాబాద్ సికింద్రాబాద్గా ఉండనివ్వండి అన్ని రచయిత, ఎస్బిఐటి సెక్రటరీ కరస్పాండెంట్, సీనియర్ బీజేపీ రాష్ట్ర నేత పి ఎల్ శ్రీనివాస్ అన్నారు.