17-01-2026 04:00:45 AM
పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు
ముషీరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): భోలక్ పూర్ డివిజన్ బాకారంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి(మల్లన్న) కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే ముఠా గోపాల్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెన్ శ్రీనివాస రావు, నగేష్ ముదిరాజ్, యువ నాయకుడు ముఠా జైసింహ, పార్టీ సీనియర్ నాయకుడు బింగి నవీన్, డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాసరావు, శివ ముదిరాజ్, రాజా దీన్ దయాల్ రెడ్డి, ఎ. శంకర్ గౌడ్, నందగిరి నరసింహ తదితరులు కళ్యాణ మహోత్సవానికి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ మేనేజింగ్ ట్రస్టీ అంజిరెడ్డి దంపతులు స్వామి వారికి శాంతి బోనం సమర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ముషీరాబాద్ సీఐ రాంబాబు ప్రారంభించారు. అంతకు ముందు ఆలయంలో అగ్నిగుండంలో ప్రవేశం, గొలుసుని తెంపుట తదితర పూజా కార్యక్రమాల నిర్వహించారు.