calender_icon.png 11 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు ఇరాన్ పరువు తీయకండి

10-01-2026 01:51:51 AM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ

టెహ్రాన్, జనవరి ౯: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు ఇరాన్ పౌరులు తమ దేశ పరువును ఫణంగా పెట్టొద్దని ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సూచించారు. ఇరాన్‌లో అంతర్గత ఉద్రిక్తతలు నెలకొన్న వేళ తాజాగా ఆయన సోషల్ మీడియా మాధ్యమంగా ఓ వీడియో విడుదల చేశారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారుల్ని హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఎలాంటి శత్రువునైనా దేశం ఎదుర్కొగలుగుతుందని అభిప్రాయ పడ్డారు.

నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని ట్రంప్ పదే పదే ఇరాన్‌ను హెచ్చరిస్తున్న అంశంపైనా ఖమేనీ స్పందించారు. ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ట్రంప్‌కు హితవు పలికారు. ఈ పరిణామాలపై ఆ దేశపు రాజు రెజా పహ్లవి స్పందిస్తూ.. ఇరాన్ పాలకులు ప్రజల గొంతు వినలేక భయపడుతున్నారని విమర్శించారు. ఇంటర్నెట్ నిలిపివేతతో ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా చేస్తున్నారని, తమ పౌరులకు యూరోపియన్ దేశాలు మద్దతు ఇవ్వాలని కోరారు.