10-01-2026 01:50:31 AM
ఐఆర్సీటీసీ స్కాం కేసులో ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జనవరి ౯: ఐఆర్సీటీసీ ల్యాండ్‌ఫర్ జాబ్స్ కుంభకోణంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ కుటుంబం క్రిమినల్ సిండికేట్‌లా వ్యవహరించిందని ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తమను నిర్దోషులుగా విడుదల చేయాలని లాలూ కుటుంబం వేసిన పిటిషన్‌ను శుక్రవారం తోసిపుచ్చి ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం లాలూ కుటుంబసభ్యులను కుట్రదారులుగా పేర్కొంది.
లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్‌ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూములు తీసుకున్నారనే అంశంపై బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. లాలూ కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కేటాయింపులో పెద్ద కుంభకోణం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలోనే కేసు నమోదైంది.