calender_icon.png 2 January, 2026 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర సమయంలో డాక్టర్ రక్తదానం

02-01-2026 12:59:24 AM

164వ సారి రక్తదానం.. 

తాండూరు, జనవరి 1 (విజయక్రాంతి): అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు బి బి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్. పూర్తి వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వాస్తవ్యులు సిరిపురం వెంకటేశ్వరరావు అనే రుద్రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేందుకు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న స్టార్ హాస్పిటల్ లో గత బుధవారం రాత్రి 11 గంటలకు వైద్యులు సిద్ధమయ్యారు. అయితే రోగి వెంకటేశ్వరరావుకు అత్యవసరంగా 0 నెగటివ్ రక్తం  కావాలని  వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

దీంతో రోగి బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియా ద్వారా డాక్టర్ సంపత్ కుమార్ రక్తం0 నెగిటివ్  ఉందని తెలుసుకున్న రోగి సోదరి ప్రవళిక డాక్టర్ సంపత్ కుమార్ ఫోన్ నెంబర్ ఆరాధిసి విషయం తెలిపారు. వెంటనే స్పందించిన డాక్టర్ సంపత్ కుమార్ అర్ధరాత్రి వేళ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేసిన అనంతరం రోగికి ఓపెన్ హార్ట్ సర్జరీ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ సంపత్ కుమార్ కు రోగి తరపు బంధువులు జీవితకాలం రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. సర్జరీ చేసిన వైద్యులు సైతం డాక్టర్ సంపత్ కుమార్ కు అభినందించారు.