02-01-2026 12:59:29 AM
పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
రాజాపూర్, జనవరి 1:గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీ పార్టీ తోనే సాధ్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు అనంద్ అన్నారు. గురువారం రాయపల్లి డిప్యూటీ సర్పంచ్, రాజపూర్ మండల బీజేపీ ఉపాధ్యక్షుడు పాలెం ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ లో చేరిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెండవ వార్డు మెంబర్ పాలెం శివ ప్రసాద్ గౌడ్,బిఆర్‌ఎస్ పార్టీ 3 వ వార్డు మెంబర్ అరుణ గౌడ్, 7 వ వార్డు మెంబర్ మొగిలి సరిత, 15 మంది యువకులు బీజేపీ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నరసింహా,బాలగౌడ్, ఉదయ్ గౌడ్,లక్ష్మి నారాయణ,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.