02-10-2025 12:41:32 AM
ప్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షులు అస్మద్
కొత్తగూడెం, ( విజయక్రాంతి) :అన్ని దానాల్లోకల్లా రక్తదానం మహత్తర పుణ్యకార్యం అని, రక్తదానం ప్రాణదానంతో సమానం అని ప్రెండ్స్ సేవా ఆర్గనైజేషన్ అధ్యక్షులు అస్మద్ అన్నారు. జాతీయ వాలంటరీ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలొ నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆర్గనైజేషన్ సభ్యులతో కలిసి రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రక్తదాన శిబరాన్ని, రక్తదానం యొక్క ప్రాముఖ్యత ప్రాణాలను కోల్పోయిన వేలాది మంది జీవితాలను కాపాడడమే కాదు, అనేక వ్యాధుల బారిన పడిన మరెంతో మంది ప్రాణాలను కాపాడటానికి అనేక వ్యాధులతో పోరాడటానికి వారికి సహాయం చేస్తుందన్నారు. ప్రజలు తమ రక్తాన్ని దానం చేసినప్పుడు, వారు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందారని, రక్తదానం చేసే చాలా మంది వ్యక్తులు, వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడమే కాక ఎక్కువ కాలం జీవించగలుగుతారన్నారు.
ఇది బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన కాలేయం, ఐరన్ స్థాయిని నిర్వహించడానికి, గుండెపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. అన్నీ దానాల్లో కల్లా రక్తదానం మహత్తర పుణ్య కార్యం అని, రక్తదానం ప్రాణదానంతో సమానం అని అన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం స్ఫూర్తిదాయకమన్న ఆయన దాతలు ఇచ్చిన రక్తం ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య సేవల కోసం వచ్చే పేద వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు.