calender_icon.png 2 October, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సమరంలో సత్తా చాటుదాం..

02-10-2025 12:42:47 AM

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పుల్లారెడ్డి

మణుగూరు, అక్టోబర్ 1, (విజయక్రాంతి) :స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో పార్టీ సత్తా చాటాలని, అత్యధిక స్థానాలు గెలిచి సిపిఐ పార్టీకి పూర్వ వైభవం తెవా లని, ఇందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి పిలుపు నిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఎడారి రమేష్ అధ్యక్షతన జరిగిన మండల కార్యవర్గ సమావేశం లో ఆయన మాట్లాడారు.

ఏ పార్టీతో పొత్తు ఉన్నా లేకున్నా స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేస్తుందని దిశ నిర్దేశం చేశారు. మండలం సీపీఐ పార్టీకి కంచుకోట అని, ఎన్నో త్యాగాలు, పోరాటాలతో పార్టీ బలపడిందన్నారు. పేదలు, బడుగులు, బలహీన వర్గాల కోసం పనిచేసిన వారి ఆశయాలను కొనసాగిం చేందుకు ఎర్రజెండా ఎగుర వేసి పార్టీ పునర్వైభవం సాధించాల్సిన బాధ్యత నాయకులపై ఉందని పేర్కొన్నారు.

కమ్యూనిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులు గెలిస్తేనే ప్రజలకు నిజమైన న్యాయం, సంక్షేమం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ పట్టణ కార్యదర్శి పట్టణ కార్యదర్శి దుర్గ్యాల సుధాకర్, ఏఐటీయుసి బ్రాంచ్ కార్యదర్శి వై.రాంగోపాల్,గిరిజన సమైక్య రాష్ట్ర ఉపాధ్యక్షులు సొందే కుటుంబరావు, నాయకులు మోహన్ రావు,ఎస్కే సర్వర్, మంగి వీరయ్య, రాయల భిక్షం, గడ్డం వెంకటేశ్వర్లు, సీతారాములు, దుబ్బక నిర్మల,సుజాత, తోట రమేష్, చింతల దశరథంపాల్గొన్నారు.