17-11-2025 12:00:00 AM
దాతల వైపు ప్రభుత్వ పాఠశాల చూపు
సీసీ కుంట మండల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ని డ్యూయల్ బెంచీలు విక్రయం
విచారణ చేటున్నాం : మురళి కృష్ణ, ఎంఈఓ, సీసీ కుంట మండలం
చిన్న చింత కుంట, నవంబర్ 16: ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వారికి తోచిన సహాయం చేయాలని సంకల్పంతో కొన్ని సమస్యలు మరికొందరు దాతలు ముందుకు వచ్చి దాతల రూపంలో ఎంతో కొంత సహాయం చేస్తున్న సందర్భాలు మనం చూస్తుంటాం. కాగా ఇక్కడ మాత్రం దాతలు దానం చేస్తే ప్రభుత్వ పాఠశాలలోని పెద్దలు ఇనుప రాడ్లతో కూడిన డియర్ బెంచ్ లను దర్జాగా విక్రయించి ఏవి పనికిరావు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్న మాట.
ఆ పాఠశాలలో మన ఊరి మనబడి పథకం ద్వారా ప్రభుత్వం నుంచి నూతన బెంచీలు రావడంతో పాతబడిన ఇనుపరారులతో కూడిన బెంచీలను చెక్కలను తొలగించి ఇనుపరారులను దర్జాగా అమ్మేసిన్రు. మరమ్మతులు చేస్తే మరో పాఠశాలలోని విద్యార్థులకు బాగుంటుందనేది మరిచి ఆ పాఠశాల నిర్వాహకులు విక్రయించడం సీసీ కుంట మండలంలో తీవ్ర చర్చ రూపం దాల్చింది.
దాతలు దానం చేస్తే..
దాతలు దానం చేయడం ద్వారా ఆ పాఠశాలకు చేరిన డిఎల్ బెంచీలు ఇనుపరారులతో కూడినవి. కొంత మరమ్మత్తు చేస్తే మరో పాఠశాలలోని బెంచీలు లేని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేవి. ఆదిశగా ఆ పాఠశాలకు సంబంధించిన పెద్దలు ఎందుకు ప్రయత్నం చేయలేదని ప్రశ్నగా మారింది.
ఇక్కడ అందుబాటులో నూతన బెంచీలు ఉన్నప్పటికీ పాత బెంచీలను మరో పాఠశాలకు ఇస్తే అక్కడ ఉన్న విద్యార్థులకు ఎంతో మేలు జరిగేది కదా అంటూ పలువురు చర్చించుకుంటుండ్రు. ప్రధానోపాధ్యాయులు మీరు కూడా ఒక్క క్షణం ఆలోచించి చూడండి. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సొంత మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పాత బెంచీలు అంటూ విక్రయించడం తీర చర్చకు దారితీస్తుంది. ఈ విషయంపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పలువురు పేర్కొనడం విశేషం.
విక్రయించడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి?
సిసి కుంట మండల కేంద్రంలోని జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విక్రయించిన డ్యూయల్ బెంచ్ లకు వచ్చిన మొత్తం అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్న లెక్క అస్సలు పొంతన లేకుండా ఉంది. పెద్దన్న పద్యాలు సూచన మేరకే తాము పాత ఇనుప సామాన్ల వారికి విక్రయించడం జరిగిందని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెబుతున్న మాట.
ప్రధానోపాధ్యాయులు మాత్రం బెంచీలకు సంబంధించి ఇనుప రాడులను విక్రయించడం ద్వారా విక్రయించడం ద్వారా రూ 6500 ఆదాయం సమకూర్దని పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెడుతున్నామని చెప్పారు.
కాగా అత్యధిక మొత్తంలో ఇనుపరాళ్ళు విక్రయించడం జరిగిందని ఈ మొత్తం కూడా అధికంగా వచ్చి ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. సంబంధిత అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తిగా పరిగణించబడిన డిఎల్ బెంచ్ లను ఎలా పడితే అలా అమ్మేందుకు వీలు ఉంటుందా? ఉండదా? అనే విషయాలను అధికారులే తేల్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
విచారణ చేస్తున్నాం..
ఏ పాఠశాల ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయులు అయినా ఆ పాఠశాలలోని ఫర్నిచర్ ను విక్రయించేందుకు వీలు లేదు. అలా విక్రయించవలసి ఉన్న కూడా ఆ పాఠశాల పరిధిలోని కమిటీ చేసుకొని బహిరంగంగా వేలం వేసి విక్రయించాలి. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటాం.
మురళీకృష్ణ, ఎంఈఓ, చిన్న చింతకుంట మండలం, మహబూబ్ నగర్ జిల్లా