12-09-2025 12:16:48 AM
సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల, సెప్టెంబర్ 11: పేదలకు వైద్య సదుపాయాలు అందించాలని సంకల్పంతో ప్రభుత్వము సిఎంఆర్‌ఎఫ్ ద్వారా అండగా నిలుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జై మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన మునగాల యేసెపు గుండెకు సంబంధించిన శాస్త్ర చికిత్స కొరకు నిమ్స్ ఆస్పత్రికి సీఎం సహాయ నిధి ద్వారా, దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కు విన్నవించగా, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వెంటనే స్పందిస్తూ, రూ,2.లక్షల 50 వేల ఎల్‌ఓసి ని, వారి కుటుంబ సభ్యులకు ప్రవీణ్ కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే అం దజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ, అనారోగ్యపరంగా, ఆపదలో ఉన్న వారికి, ఆర్థికంగా అందించాలనే లక్ష్యంతో, మెరుగైన వైద్య చికిత్స కు,రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ప్రతి లబ్ధిదారునికి ఎన్ ఓ సి ఇవ్వడం జరుగుతుందని, ఈ సందర్భంగా గుర్తు చే శారు. ఈ కార్యక్రమంలో, అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీహరి,జిల్లా కాం గ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల.విజయ్ మోహన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కె.వే గనాథ్, పరశురాములు, చెన్నకేశవ్,రాములు, బుచ్చన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.