29-10-2025 01:07:53 AM
చుంచుపల్లి, (విజయక్రాంతి ): తెలంగాణ జాగృతి కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ గా నమ్మి జగదీష్ నియమితులయ్యారు. తె లంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ గా జగదీష్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లో కవిత సమక్షంలో పార్టీలో చేరిన జగదీష్ కు కండువా కప్పిన కవిత కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించడం పట్ల జాగృతి నాయకులు హర్షం వ్యక్తం చేశారు, తెలంగాణ జాగృతి కొత్తగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ గా తనకు అవకాశం కల్పించిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుం ట్ల కవితకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన జగదీష్, తనకు ఇచ్చిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు