16-05-2025 12:14:49 AM
ఈవీని ప్రారంభించిన జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా వారు గురువారం కొత్త సాంకేతికత, భద్రతా లక్షణాలతో పాటు, కొత్త 52.9 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ‘ఎండీ విండ్సర్ ప్రో’ ఈవీను ప్రారంభించారు.
ఆకర్షణీయమైన పరిచయ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (బాస్) ధర రూ.12.49లక్షలు, ఎక్స్-షోరూమ్ ధర రూ.17,49,800 (మొదటి 8,000 బుకింగ్‌లకు చెల్లుతుంది)తో ప్రారంభించబడింది. విండ్సర్ ప్రో మొదటి యజమానికి కంపెనీ జీవితకాల బ్యాటరీ వారంటీని అందిస్తుంది. అదనంగా, 3-60 హామీ బైబ్యాక్ ప్లాన్‌ను అందిస్తుంది.
ఇది 3 సంవత్సరాల తర్వాత దాని విలువలో 60శాతం నిలుపుకుంటుంది. జేఎస్‌డ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహన విభాగం వృద్ధిని వేగవంతం చేయడంలో ఎండీ విండ్సర్ కీలక పాత్ర పోషించిందన్నారు. ప్రారంభ కొనుగోలుదారుల నుంచి వచ్చిన సానుకూల నోటి మాట దాని వేగవంతమైన ఆమోదానికి ఆజ్యం పోసిందన్నారు.
ఎంజీ విండ్సర్ ప్రో ఆవిష్కరణ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ విశ్వాసాన్ని కలిగించేలా చేస్తుందన్నారు. ‘బాస్’ను మరింతగా చేరుకోవడానికి కంపెనీ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, కోటక్ మహీంద్రా ప్రైమ్ వంటి కొత్త ఫైనాన్షియర్లు సహకారం ఉన్నదని చెప్పారు. విండ్సర్ ప్రో బ్యాటరీ 52.9 కేడబ్ల్యూహెచ్, పెద్ద బ్యాటరీ ప్యాక్, 449 కిమీ సర్టిఫైడ్ రేంజ్ ఉంటుంది.