19-08-2025 12:54:50 AM
కీసర,ఆగస్టు 18 (విజయక్రాంతి);కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామికి సిక్ గ్రామం, తాడ్బండ్కు చెందిన సదా నరసింహారెడ్డి, పుష్పలత దంపతులు బంగారు ఆభరణాన్ని విరాళంగా సమర్పించారు. సు మారు ఆరున్నర లక్షల బంగారు తాపడంతో చేసిన నాగపడగ ఆభరణాన్ని స్వామివారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్రీ తటాకం నారాయణ శర్మ దాతలను అభినందించి, స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు కౌకుంట్ల కృష్ణారెడ్డి, నల్ల మధుసూదన్ రెడ్డి, ప్రవీణ్, రాజి రెడ్డి, రాజు యాదవ్, ఆలయ ప్రధాన అర్చకులు బలరాం శర్మఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దాతల దాతృత్వాన్ని ఆలయ అధికారులు కొనియాడారు.