19-08-2025 01:47:43 AM
వరద ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఆదిలాబాద్, ఆగస్టు 18 (విజయ క్రాంతి) : భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవడంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు త్వరితగతిన మరమ్మతులు చేయించి రాకపోకల ఇబ్బందులను తొలగిస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని వరద ప్రాంతాలైన సిరికొండ, ఇంద్రవెల్లి మండలాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటపొలాలు నీట మునగగా, వంతెనలు కూలిపోయిన, ఇండ్లులోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని పలు ప్రాంతాల్లో ఎమ్మె ల్యే పర్యటించారు.
కొండాపూర్ గ్రామ వంతెనను, ఇంద్రవెల్లి మండలంలోని ముత్తాపూర్ లోత్రివేణి సంగమం ప్రాజెక్ట్ తో పాటు కోత కు గురైన రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు నెరకొరగగా, దెబ్బతిన్న రోడ్ల తో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో తక్షణమే సహాయక చర్యలు చేపడతామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రతి శాఖ అధికారులను అడిగి నష్టం వివరాలు తెలుసుకొన్నారు. క్షేత్రస్థాయిలో సం బంధించిన అధికారులు పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలన్నారు. అన్నదాతలకు తక్షణమే నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. త్వరలో కొండాపూర్ వంతె న కాంట్రాక్టర్‌తో మాట్లాడి అక్టోబర్ మాసం లో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షం తగ్గిన వెంటనే మరమ్మతులు పూర్తి చేయిస్తామన్నారు. ఎమ్మెల్యే వెంట ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కాడే ఉత్తం, సిరికొండ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఇమామ్, సోయం బారిక్ రావ్, పలువురు అధికారులు ఉన్నారు.
నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో మంత్రి పర్యటన
నిర్మల్, ఆగస్టు ౧౮ (విజయక్రాంతి): రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ జూపల్లి కృష్ణారావు మంగళ బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో వరదలు ఏర్పడి ప్రజలకు నష్టం జరిగినందున ఆ ప్రాంతాలను సందర్శించి ప్రభుత్వం ద్వారా చేసే సహాయ కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష ఇచ్చా రు. మంగళవారం ఉదయం నిర్మల్ మధ్యాహ్నం అదిలాబాద్, సాయం త్రం 6 గంటలకు ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్లి బుధవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో పర్య టించినట్టు అధికారులు తెలిపారు మం త్రి పర్యటనకు టూరు గైడ్లు ప్రకటించినట్టు కలెక్టర్ వివరించారు అధికారు లందరూ కూడా తగిన నివేదికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.