calender_icon.png 19 August, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందించాలి

19-08-2025 01:46:06 AM

-నీట మునిగిన పంట పొలాలను ఎడ్ల బండిలో వెళ్లి పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి):  భారీ వర్షానికి తోడుగా ఓవైపు సాత్నాల,  మరోవైపు పెన్ గంగా నది వరద ఉధృతి కారణంగా వేల ఎకరాల పంట నీట మునిగిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజులు గా కురుస్తున్న భారీ వర్షాలతో పంట నష్టపోయిన వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే సోమవారం విస్తృతంగా పర్యటించారు.

బోరజ్ మండలంలోని కేదర్పూర్, ఆకోలి, గిమ్మ, కోరాట, పూసాయి, పిప్పర్ వాడ తదితర గ్రామాల్లో తహసీల్దార్ రాజేశ్వరీ అగ్రికల్చర్ అధికారులు, బీజేపీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎడ్ల బండి పై ఎక్కి వాగులు దాటుతూ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.  బాధిత రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా సిఎం రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసినట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పంట నష్టం వివరాలను కేంద్ర మంత్రులకు సైతం తెలియజేస్తామని అన్నారు. బీజేపీ నాయకులు అశోక్ రెడ్డి, సన్నీ, గంగాధర్, శ్రీనివాస్, మనోజ్, పలువురు అధికారులు తదితరులు ఉన్నారు. 

--------వర్షం కురిస్తే పట్టణంలో అవస్థలు

రామకృష్ణాపూర్, ఆగస్టు 18: వర్షం కురిస్తే చాలు పట్టణ వాసులకు అవస్థలు తప్పడం లేదు. రాత్రి నుండి కురిసిన వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంత సేపు ముసురు లా, మరికొంత సమయం జోరుగా కురియడంతో కాలనీలు, రోడ్లపై వర్షం నీరు చేరి బుర దమయంగా మారాయి. ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై మున్సి పాల్టీ వాసులు పెదవి విరుస్తున్నారు. ఏటా వర్షాకాలంలో ఆర్కే వన్ మొరి ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో అటువైపుగా పాదచారులు, వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

కాలనీల్లో నీరు వెళ్లేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఆర్కే వన్ మొరి, ఏ జోన్, పోచమ్మ బస్తీ, శివాజీ నగర్, 33 కేవీ సబ్ స్టేషన్ మొదలైన కాలనీలోని రహదారులు జలమయమయ్యాయి. అలాగే విద్యాన గర్ ఏరియాల్లో ఓ ఇంట్లోకి వరద నీరు,చెత్త చెదారం చేరడంతో మంచాలపైనే ఉం డాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. కురిసిన వర్షానికి ఉదయం నుండి ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇష్టపడలేదు. మున్సిపాలిటి కమిషనర్ గద్దె రాజు,పలు ప్రాంతాల్లో నిలిచిన నీటిని పంపించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.