09-04-2025 12:24:01 AM
ఎమ్మెల్యే హరీష్ బాబు
కాగజ్ నగర్, ఏప్రిల్8( విజయ క్రాంతి): కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ పథకాలకు అర్హులైన వారు దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంగళవారం కాగజ్ నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్ లో 314 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం అందిస్తున్న కానుకను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన వారికి ప్రభు త్వ పథకాలు అందించేందుకు కృషి చేయ డం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కిరణ్, ఆర్ ఐ సిద్ధార్థ, సీనియర్ అసిస్టెంట్ ప్రమీల, నాయకులు శివ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.