calender_icon.png 27 October, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళారులకు విక్రయించి మోసపోవద్దు

27-10-2025 12:16:23 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి 

కల్వకుర్తి అక్టోబర్ 26: రైతులు పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని రైతులు తాము పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాలుకు రూ, 2,400 ధర నిర్ణయించిందని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి లబ్ది పొందాలని అన్నారు. దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం సరిగా ఉండేలా చూసు కోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రం ద్వారా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని అన్నారు.

రైతులు భూమి పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, వ్యవసాయ విస్తరణాధికారితో లేఖను తీసుకొని మార్కెట్ కు ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, పొల్యూషన్ బో్రు్డ సభ్యుడు బాలాజి సింగ్, నాయకులు సంజీవ్ యాదవ్ , ఆనంద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, కొండల్ , శేఖర్ రెడ్డి , మసూద్ తదితరులుపాల్గొన్నారు.