19-09-2025 12:00:00 AM
సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
మణుగూరు, సెప్టెంబర్ 18 (విజ యక్రాంతి) : జీతాలు తగ్గించి మా పొట్ట కొట్టొద్దు సార్.. అంటూగిరిజన హాస్టల్లో పనిచేసే వర్కర్లు అటు అధికారులను, ఇటు ప్రజాప్ర తినిధులను ప్రా ధేయ పడుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎమ్మెల్యేకు సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వర్కర్ల సమస్యలను ము ఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తా నని,జీతాలు తగ్గించే జీవో 64 ,క్యాటరింగ్ జీవో 527 రద్దు కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించే విధంగా కృషి చేస్తానన్నారు. జేఏసీ జిల్లా నాయకులు, బ్రహ్మచారి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులకు 10 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, వెంటనే విడుదల చేయాలని, సమస్యల పరిష్కరించి, ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వారసత్వ నియామకాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
సిపిఎం నేత నెల్లూరు నాగేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాస్ రావు, వ్యవసాయ సంఘం నాయకులు నైనారపు నాగేశ్వరరావు సమ్మెకు మద్దతు ప్రక టించారు. హీరాలాల్, చందా జలంధర్, కౌసల్య ,పండా మంగమ్మ, కుమారి, రామచంద్రయ్య, జీవా, లక్ష్మి , ముసలయ్య పాపయ్య,శ్రీరాములు, పాల్గొన్నారు.