calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శభాష్ డాక్టర్ రామకృష్ణ

19-09-2025 12:00:00 AM

భద్రాచలం, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రా చలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, ఒక కష్టతరమైన ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్, వైద్యు లు, సిబ్బంది.

గన్నవరానికి చెందిన 8 సంవత్సరాల గౌతమ్ ఆడుకుంటున్న క్రమంలో స్క్రూ డ్రైవర్ మింగడంతో, విపరీతమైన కడుపునొప్పి రావడంతో భద్రాచలం ఏరియా ఆ సుపత్రికి వెనువెంటనే తీసుకురావడంతో ఆ కండిషన్ లో ఉన్న ఆ బాలుడిని పరీక్షించి,

వెంటనే స్పందించి సంబంధిత పరీక్షలు నిర్వహించి, పేగులో ఇరుక్కుపోయిన 6 సెంటీ మీటర్ల స్క్రూ డ్రైవర్ ను గంటల సమయం శ్రమించి తొలగించిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ నాయకత్వంలో వైద్యులు సిబ్బంది సహాయంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వ హించి ఆ స్కూ డ్రైవర్ ను బయటికి తీసి గౌతమ్ ప్రాణాలు కాపాడారు,

లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఎటువంటి రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భద్రాచలంలో నిర్వహించిన వైద్యులకు, మరియు సిబ్బందికి బా లుడు కుటుంబ సభ్యులు, వారి గ్రామస్తులు, కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. ఇంతటి మం చి కార్యక్రమానికి పూనుకున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ , వైద్యులు, సిబ్బందికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.