calender_icon.png 19 September, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

19-09-2025 01:11:51 AM

-గిట్టని వ్యక్తులే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారు

-నేను ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు

-మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

చిట్యాల, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో తన ఇమేజ్ తగ్గించే విధంగా ఫేక్ న్యూస్ లు వైరల్ చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. గురు వారం గుంటూరులోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ చిట్యాలలోని ఒక హోట ల్‌లో ఆగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటిసారి గత అసెంబ్లీలో ప్రశ్నించిన వ్యక్తిని తనే అని కానీ  సమర్థిస్తున్నట్టు ఫేక్ న్యూస్ పేపర్ లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏదో మంత్రి పదవి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న ట్లు భావించి అబద్దాలను సోషల్ మీడియా లో ప్రచారం చేస్తున్నారని వాటిని ఆయన తీవ్రంగా ఖండిచారు.

కొత్త పార్టీ పెడుతున్నట్టు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని,  ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలుపొందిన నా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని,  తెలంగాణ ప్రజలు ఫేక్ న్యూస్ ని నమ్మొద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విషయాలు ఇలా చేస్తే బా గుంటది అని కొన్ని వేదికల ద్వారా సలహా లు, సూచనలు చేసానే తప్ప తాను ఎప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకు వెళ్తుంటే అక్కడ ఏదో జగన్ ను కలుస్తానని ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని ఆయన ప్రజలకు తెలియజేశారు.