calender_icon.png 19 September, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి గ్లోబల్ ప్రాజెక్టులకు ఎస్‌బీఐ సహకారం

19-09-2025 01:11:31 AM

  1. ముంబైలో ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టితో సింగరేణి సీఎండీ బలరాం భేటీ
  2. సింగరేణి విస్తరణ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని సింగరేణి సీఎండీ విజ్ఞప్తి

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): సింగరేణి గ్లోబల్ పేరుతో దేశ విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయమందించేందుకు ఎస్ బీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది. సింగరేణి సీ ఎండీ ఎన్ బలరాం గురువారం ముంబైలో ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్ర కుమార్ సింగ్, సీజీఎం శైలేశ్ ఉన్నితన్‌లతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.

సింగరేణి సంస్థ త్వరలోనే దేశ విదేశాల్లో కీలక ఖనిజ రంగంలోకి ప్రవేశించనుంది. కేంద్ర ప్రభుత్వం కీలక ఖనిజాల రంగానికి సంబంధించి అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశంలో కూడా పెద్ద ఎత్తున కీలక ఖనిజ ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించింది. దీనితోపాటు పంప్డ్ స్టోరేజీ ప్లాం ట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాం ట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోందని సింగరేణీ సీఎండీ ఎన్ బలరాం ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టికి వివరించారు.

ఈ నేపథ్యంలో సింగరేణి త్వరలో చేపట్టే భారీ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకి ఆర్థిక సహకారం అందించాలని సీఎండీ బలరాం కోరారు. దీనిపై ఎస్‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సానుకూలంగా స్పందించారు. సింగరేణి ప్రాజెక్టులకు పూర్తిగా సహకరిస్తామన్నారు. ఇప్పటికే సింగరేణికి లీడ్ బ్యాంకుగా సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. సింగరేణి అంతర్జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా సత్తా చాటాలని ఆకాంక్షించారు. 

త్వరలో ఈపీ ఆపరేటర్లకు పదోన్నతులు

ఓపెన్ కాస్ట్ (ఓసీ) గనుల్లో పనిచేస్తున్న అర్హత ఉన్న ఈపీ ఆపరేటర్లకు ఎక్స్‌కవేషన్ కేటగిరీ డీ నుంచి కేటగిరీ అలాగే సీ నుంచి బీకి త్వరలో పదోన్నతులు కలగనున్నాయి. దీనివల్ల సింగరేణి వ్యాప్తంగా సుమారు 150 మంది ఆపరేటర్లకు పదోన్నతులు దక్కనున్నాయి.

ఎక్స్‌కవేషన్ కేటగిరీ  లో రెండు సంవత్సరాలు పూర్తిచేసిన ఆపరేటర్లకు కేటగిరీ అలాగే కేటగిరీ మూడు సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసిన ఆపరేటర్లకు కేటగిరీ పదోన్నతులు కల్పించడానికి సింగరేణి యాజ మాన్యం అంగీకరించింది. ఈ ప్రమోషన్లను ఈ ఒక్కసారి మాత్రమే కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఆదేశించడంతో..గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.